కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో మంగళవారం అటవీ శాఖ అధికారులు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ( International Tigers Day ) నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి ఫారెస్ట్ అధికారులు ర్యాలీ ( Rally ) నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్ధులకు బెల్లంపల్లి రేంజర్ సీహెచ్ పూర్ణచందర్ చేతుల మీదుగా బహుమతులు అందించారు.
పులుల ప్రాముఖ్యత, అడవుల రక్షణపై అవగాహాన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఖలీల్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు బీ. ప్రవీణ్ నాయక్, కే. గౌరీ శంకర్, శ్రీనివాస్, బీట్ ఆఫీసర్ శ్రీధర్, ఉపాధ్యాయులు గణేష్, అశోక్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.