ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జూన్ 7: అనుమతి లేకుండా మూగజీవాలను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సురేశ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూగ జీవాలను తరలిస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, స్వయంగా వాహనాలను అడ్డుకొని గొడవలు సృష్టించడం సరికాదని తెలిపారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పశు సంవర్ధక శాఖ సమన్వయంతో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.