సోన్, నవంబర్ 1 : పదేళ్ల కాలంలోజరిగిన అభివృద్ధికి పట్టం కట్టాలని, బీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోన్ మండలంలోని కూచన్‌పెల్లి, బొప్పారం, కడ్తాల్ గ్రామాల నుంచి వందలాది మంది యువకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు.
వారికి అల్లోల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పదేళ్లలో జరిగిన అభివృద్ధికి ఆకర్శితులై, రోజురోజుకు చేరికలు పెరుగుతున్నాయన్నారు. సీం కేసీఆర్ నాయకత్వంలో ఇంటింటా ఒక సంక్షేమ పథకం చేరుకోవడమే నిదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సోన్ మండల కన్వీనర్ మోహినొద్దిన్, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్‌రెడ్డి, ఇన్చార్జి మహేశ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ బండి లింగన్న, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు అర్జున్ లింగన్న, మాజీ ఉప సర్పంచ్ చాకలి సాయన్న, డాక్టర్ మనోహార్, గంగన్న, సుంకరి రాజేశ్వర్, సుంకరి ముత్తన్న తదితరులు పాల్గొన్నారు.