ఆదిలాబాద్, ఏప్రిల్ 11 ( నమస్తే తెలంగాణ) : జిల్లాలో రైతులు వానకాలంలో పత్తి, సోయాబీన్, కంది, ఇతర పంటలు సాగు చేస్తారు. యా సంగిలో శనగ, పల్లి, గోధుమ, జొన్న పంటలు పండిస్తారు. ఈ ఏడాది యాసంగిలో రైతులు జిల్లాలో 1.08 లక్షల ఎకరాల్లో శనగ పంటను వేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా జిల్లాలో ఏటా పంటల సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. గతేడాది యాసంగిలో జిల్లాలో 80 వేల ఎకరాల్లో శనగ పంటను సాగు చేస్తే.. ఈ ఏ డాది 1.08 లక్షల ఎకరాల్లో రైతులు పంట వేశా రు. గత సీజన్‌తో పోలిస్తే 28 వేల ఎకరాల పంట విస్తీర్ణం పెరిగింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. జిల్లాలో వానకాలంలో పత్తి, సో యాబీన్, కంది పంటలను కొనుగోలు చేసిన ప్ర భుత్వం.. యాసంగిలో శనగ పంట కొనుగోళ్లకు సైతం చర్యలు తీసుకున్నది. ఈ ఏడాది శనగ పం టకు ప్రభుత్వం క్వింటాకు రూ.5,335 మద్దతు ధర ప్రకటించింది. సీజన్లో ప్రైవేట్‌లో వ్యాపారులు శనగలను క్వింటాకు రూ.4,700తో కొనుగోలు చేస్తుండగా.. రైతులు నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మార్క్‌ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో జిల్లాలో పది మార్కెట్‌యార్డుల్లో కొనుగోళ్లు చేపట్టారు.
జిల్లాలో రైతులు యాసంగిలో సాగు చేసిన శన గ పంట కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పది మార్కెట్‌యార్డుల్లో ఇప్పటి వరకు 3,19,167 క్వింటాళ్ల పంటను అధికారులు సేకరించారు. ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో 80,715 క్వింటాళ్లు, తాంసిలో 21,121, బోథ్‌లో 47,018, బజార్హత్నూర్లో 20,719, ఇంద్రవెల్లిలో 10,365, నార్నూర్‌లో 4183, ఇచ్చోడలో 34,128, సిరికొండలో 6,830, జైనథ్‌లో 66,033, బేలలో 28,054 క్వింటాళ్ల చొప్పు న పంటను సేకరించారు. జిల్లా వ్యాప్తంగా 19,686 మంది రైతుల నుంచి పంటను కొనుగోలు చేశారు. క్రాప్ బుకింగ్ విధానంలో పంట కొనుగోళ్లు జరుగుతున్నాయి. ప్రైవేట్‌లో శనగలకు వ్యాపారులు తక్కువ ధర చెల్లిస్తుండగా.. రైతులు భారీగా పంటను మార్కెట్‌యార్డులకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. దీంతో శనగలతో మార్కెట్‌యార్డులు నిండిపోయాయి. పంట నిల్వల కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సంచుల్లో నింపిన శనగలను గోదాములకు తరలిస్తున్నారు. ఎండలతో రైతులు ఇబ్బందులు పడకుండా తాగునీరు, నీడ, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం పంటను కొనుగోలు చేయడంపై రైతులు సంతో షం వ్యక్తం చేస్తున్నారు.
నేను యాసంగిలో ఏడు ఎకరాల్లో శనగ పంట సాగు చేశా. 52 క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చింది. ఆదిలాబాద్‌లో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.4,700 చొప్పున కొంటున్నారు. ప్రభుత్వం మద్దతు ధరతో క్వింటాల్‌కు రూ.5,335తో సేకరిస్తున్నది. ఆదిలాబాద్ మార్కెట్‌యార్డుకు తీసుకొచ్చి పంటను అమ్మాను. బయటకంటే క్వింటాల్‌కు రూ.635 ఎక్కువ ధర లభించింది. రైతులు నష్టపోకుండా సర్కారు పంట కొనుగోలు చేయడం సంతోషంగా ఉంది.
– రాజు, లేఖర్వాడ, జైనథ్ మండలం
ఈ ఏడాది శనగ పంట దిగుబడులు బాగా వచ్చాయి. దీంతో రైతులు ఇబ్బందులు పడకుండా మార్కెట్‌యార్డుల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. జిల్లాలో పది మార్కెట్‌యార్డుల్లో మద్దతు ధర క్వింటాకు రూ.5,335తో కొనుగోలు చేస్తున్నాం. టార్పాలిన్ల్లు, గన్నీ సంచులు అందుబాటులో ఉంచాం. శనగ కొనుగోళ్లు పారదర్శకంగా ఉండడానికి క్రాప్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నాం. పంట నిల్వలు పేరుకుపోకుండా కొనుగోలు చేసిన శనగలను ఎప్పటికప్పుడు లారీల ద్వారా గోదాములకు తరలిస్తున్నాం.
– శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ అధికారి, ఆదిలాబాద్