ముథోల్, మార్చి 31 : నిర్మల్ జిల్లా బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, ఆహ్లాదక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. ఏప్రిల్ 6న బాసర ఆలయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నందున, ఏర్పాట్లపై కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి ఆయన సమీక్షించారు. ముఖ్యమంత్రి అమ్మవారిని దర్శించుకొని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని వివరించారు. రానున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయ రామారావు, తహసీల్దార్ పవన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.