సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించాలి
మూత పడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ (సీసీఐ)ను కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రారంభించాలని, లేనిపక్షంలో రైతుల వద్ద సేకరించిన భూములను తిరిగి అ ప్పగించాలంటూ సీసీఐ సాధన కమిటీ సభ్యులు డి మాండ్ చేశారు.
- లేకపోతే రైతుల భూములు అప్పగించాలి
- సీసీఐ సాధన కమిటీ డిమాండ్
- పనులను అడ్డుకున్న కమిటీ సభ్యులు
ఆదిలాబాద్, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ) :మూత పడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ (సీసీఐ)ను కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రారంభించాలని, లేనిపక్షంలో రైతుల వద్ద సేకరించిన భూములను తిరిగి అ ప్పగించాలంటూ సీసీఐ సాధన కమిటీ సభ్యులు డి మాండ్ చేశారు. బుధవారం కమిటీ సభ్యులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐని సందర్శించారు. అక్కడ జరుగుతున్న చెట్ల తీసివేత, భూములు చదును చేసే పనులు అడ్డుకున్నారు. పరిశ్రమ ముందు ఆందోళన చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పనులు చేస్తున్న జేసీబీతోపాటు కార్మికులను అక్కడి నుంచి పంపించేశారు. కేంద్ర హోంశా ఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యేలు మూతపడిన సీసీఐని తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐలో చెట్ల తీసివేత, ఇతర పనులు ఎందుకు చేస్తున్నారనే విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రారంభించకపోతే భూములు అప్పగించాలి..
ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను తిరిగి ప్రారంభించడానికి అన్ని అవకాశాలున్నాయని సీసీఐ సాధన కమిటీ సభ్యులు, భూములు కోల్పోయిన రైతులు అన్నారు. ప్రస్తుతం సిమెంటు రంగానికి ఉన్న డిమాండ్ కారణంగా పరిశ్రమ లాభాల్లో నడిచే అవకాశాలతోపాటు ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. సిమెంటు తయారీకి అవసరమైన ముడిసరుకుతోపాటు నీటి సౌకర్యం, విద్యుత్, జాతీయ రహదారి, రైలు మార్గాలు ఉన్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమను అమ్మకానికి పెట్టకుంటే వెంటనే తిరిగి ప్రారంభించాలని, లేకపక్షంలో తమ వద్ద తీసుకున్న భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. సీసీఐ భూములను విక్రయిస్తే ఆందోళన చేస్తామన్నారు.
సీసీఐ భూములను అమ్మకునే ప్రయత్నాలు మానుకోవాలి
సీసీఐ భూములను విక్రయించే ప్రయత్నాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలి. సిమెంటు పరిశ్రమ ప్రారంభిస్తే ఐదు వేల మందికి ఉపాధి లభించడంతోపాటు జిల్లా అభివృద్ధి జరుగుతుంది. ఎన్నికల సమయంలో సీసీఐని ప్రారంభిస్తామని బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఇచ్చిన మాటలు మరిచి, పరిశ్రమ అమ్మకానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సీసీఐ పనురుద్ధణ కోసం ఉద్యమాలు చేస్తున్నామని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమ ప్రారంభానికి చర్యలు చేపట్టింది. ఇందుకోసం మూడు ప్రతిపాదనలు కేంద్ర 51, రాష్ట్రం 49 శాతం నిధులతో నడపడం, పరిశ్రమకు రాయితీలు ఇవ్వడంతో పాటు పాత బకాయిలు రద్దు చేయడం, కేంద్ర పరిశ్రమను అప్పగిస్తే వంద శాతం నిధులతో నడపడం వంటి సూచనలు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిపాదనలు కేంద్ర పట్టించుకోలేదు. పరిశ్రమను అమ్మకాన్ని అడ్డుకుంటాం. తిరిగి ప్రారంభించేలా కార్యాచరణను తయారు చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి
– విజ్జిగిరి నారాయణ, సీసీఐ సాధన కమిటీ కో- కన్వీనర్
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- adilabad
- CCI
- cement factory
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

