దండేపల్లి : క్రీడలతో ( Sports) మానసికోల్లాసం కలుగుతుందని, గ్రామీణ యువత ప్రతిభ చాటేందుకు క్రీడలు దోహదం చేస్తాయని తెలంగాణ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి (Kotnaka Tirupati) అన్నారు. దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కంది సతీష్ అన్న యువ సైన్యం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు.

గెలుపొందిన తాళ్లపేట జట్టుకు రూ. 10 వేల నగదుతో పాటు ట్రోఫీ, రన్నర్ గా నిలిచిన లక్షెట్టిపేట జట్టుకు రూ.5 వేల నగదు ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు ఆడడం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. గెలుపుతో మురిసిపోకుండా, ఓటమితో కృంగిపోకుండా జీవితంలో రాణించడం నేర్చుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, మాజీ ఎంపీపీలు జాబు కాంతారావు, గురువయ్య, అక్కల వెంకటేశ్వర్లు, సర్పంచులు పెంట సత్తయ్య, చిలుకూరి మహేష్, శంకరవ్వ, మాజీ ఎంపిటిసిలు కంది సతీష్ హేమలత, ముత్యాల శ్రీనివాస్, బొడ్డు కమలాకర్, వనపర్తి రవి, ఉపసర్పంచ్ ఫయాజ్, తిరుపతి నాయక్, స్థానిక నాయకులు అడాయి కాంతారావు, కన్నాక జంగు, సందేల తిరుపతి, శ్రీధర్, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.