మంచిర్యాల అర్బన్, ఆగస్టు 2 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వరండాలో మడత మంచాలు వేసి వైద్యం అందిస్తున్న తీరుపై జూలై 31న ‘నమస్తే తెలంగాణ’లో ‘మడత మంచాలపై వైద్యం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు.
దవాఖాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే మడత మంచాలు ఎత్తి వేయాలని, రోగులకు బెడ్లు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యమందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మడత మంచాలను ఎత్తివేసి ఎస్ఐసీయూ, కేర్ సెంటర్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు రోగులకు చికిత్స అందిస్తున్నారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ‘నమస్తే తెలంగాణ’కు పలువురు రోగులు కృతజ్ఞతలు తెలిపారు.