కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : పల్లెల్లో నకిలీ విత్తనాల దందా మొదలైంది. అమాయక రైతులకు వాటిని అం టగట్టి అందినకాడికి దండుకునే ప్రయ త్నం కొనసాగుతున్నది. పేరు..ఊరు లేని కంపెనీల్లో తయారైన విత్తనాల ప్యాకెట్లను విక్రయించేందుకు వ్యాపారులు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఇటీవల సిర్పూర్-యూలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 5.45 క్వింట్లాళ్ల పత్తి విత్తనాలు పట్టుబడడం ఇందుకు బలం చేకూరుతున్నది.
వివిధ రకాల కంపెనీల పేర్లతో నకిలీ విత్తనాలు అమాయక రైతులకు అంటగడుతున్న ముఠాలను అరికట్టేందుకు అధికారులు చర్య లు చేపడుతున్నారు. జిల్లాలో ఎరువులు, విత్తనాలు అమ్మేందుకు లైనెస్స్లు పొందిన డీలర్లు 251 మంది ఉన్నారు. వీరు తమ దు కాణాల ద్వారా విత్తనాలు, ఎరువులు అమ్ముతున్నారు. పట్టుబడుతున్న నకిలీ విత్తనాలను లైసెన్స్ పొందిన వారే తెప్పిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వివిధ కంపెనీల పేరిట విత్తనాలు విక్రయిస్తున్న ముఠాలను అరికట్టేందుకు చ ర్యలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా టాస్క్ఫో ర్స్ బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు.
మండలాలతో ఏమాత్రం సం బంధం లేని అధికారుల బృందాలు దుకాణా ల్లో తనిఖీ చేస్తున్నాయి. ప్రతి ఎరువుల దుకాణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జిల్లాలోకి నకిలీ విత్తనాలు ఎలా వస్తున్నాయి..? వాటి వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాలపై ఆ రా తీస్తున్నారు. ఇటీవల కలెక్టర్ హరిత కూ డా పలు ఫర్టిలైజర్స్ దుకాణాలును తనిఖీ చే సి, రికార్డులను పరిశీలించారు. ఆంధ్రలోని కర్నూల్, గుంటూరు, మహారాష్ర్టాలోని పలు జిల్లాల నుంచి వివిధ మార్గాల ద్వారా కొరియర్ ద్వారా నకిలీ విత్తనాలు జిల్లాలోకి వస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే జిల్లాల నకిలీ విత్తనాలు పట్టుబడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి.