చదువుతోనే ప్రత్యేక గుర్తింపు .. ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్

ఇంద్రవెల్లి : గ్రామీణ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన యువత ఉన్నత చదువులు చదువుకుంటేనే సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని కెస్లాపూర్ గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం నాగోబా ఆలయాన్ని సందర్శించి నాగోబాను దర్శించుకున్నారు. రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ. . తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన యువకులు ఉన్నత చదువులు చదువుకోవాలన్నారు.
సమాజంలో విద్యా చాల ముఖ్యమైందన్నారు. నాగోబా ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజురూ చేసిందన్నారు. సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్ మాట్లాడుతూ.. తమకు ఉన్నచోటే డబుల్ బెడ్ రూం, మినిబస్టాండ్ మంజూరు, గ్రామంలో సీసీరోడ్లు, కెస్లాపూర్ నుంచి హర్కాపూర్ ఎక్స్రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. గ్రంథాలయంలో సామగ్రితోపాటు పుస్తకాలు ఏర్పాటుకు తన నిధుల నుంచి రూ.50వేలు అందిస్తానని జడ్పీ చైర్మన్ తెలిపారు
కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, మాజీ ఎంపీపీ కనక తుకారాం, సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్, కెస్లాపూర్ గ్రామపటేల్ మెస్రం వెంకట్రావ్పటేల్, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ కనక హనుమంత్రావ్, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు శేక్ సుఫియాన్, లక్కారాం మాజీ సర్పంచ్ మర్సుకోలా తిరుపతి, మెస్రం వంశీయులు నాగ్నాథ్, ఆనంద్రావ్, యూత్ సభ్యులు షెగ్నాథ్, తోడసం సాగర్, గణేశ్, జ్యోతిరాం, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

