చెన్నూర్ రూరల్, ఆగస్టు 3 : చెన్నూర్ మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. నెల రోజుల ‘క్రితం మంత్రి ఇలాకాలో మట్టి దందా’ అనే కథనం ‘నమస్తే’లో ప్రచురితం కావడంతో అధికారులు అప్రమత్తమై అక్రమంగా మట్టి తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఎర్రగుంటపల్లిలో అనుమతి లేకుండా వ్యాపారులు జేసీబీలతో అక్రమంగా మట్టి తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో అక్రమంగా మట్టి దందా సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా ఇసుక, మట్టి దందాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి వివేక్ ఎన్నిసార్లు చెప్పినా మట్టి దందా మాత్రం ఆగడం లేదు. కాంగ్రెస్ నాయకుల అండదండలతో దం దాలు నడుస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విషయంపై చెన్నూర్ తహసీల్దార్ మల్లికార్జున్ను వివరణ కోరగా మండలంలో ఎక్కడ కూడా ఎవరికీ మట్టి తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇరిగేషన్ డీఈ వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
-చెన్నూర్ తహసీల్దార్ మల్లికార్జున్