Pranahita river | ప్రాణహితపై అనుబంధాల వారధి.. దశాబ్దాల కల సాకారం చేసిన తెలంగాణ సర్కారు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున ప్రాణహితపై నిర్మించిన అంతర్రాష్ట్ర వంతెనతో దశాబ్దాల కల నెరవేరింది. రూ.65 కోట్లతో నిర్మించిన ఈ భారీ వారధి రెండేళ్ల క్రితం పూర్తికాగా, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది.
- గూడెం వద్ద ప్రాణహితపై రూ. 65 కోట్లతో వంతెన నిర్మాణం
- తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు సాఫీగా రాకపోకలు
- ఆయా ప్రాంతాలకు తగ్గిన దూరభారం
- మెరుగుపడిన ఆత్మీయ, వాణిజ్య, వ్యాపార సంబంధాలు
- నాటు పడవ ప్రమాదాలకు బ్రేక్
Pranahita river | కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున ప్రాణహితపై నిర్మించిన అంతర్రాష్ట్ర వంతెనతో దశాబ్దాల కల నెరవేరింది. రూ.65 కోట్లతో నిర్మించిన ఈ భారీ వారధి రెండేళ్ల క్రితం పూర్తికాగా, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. ప్రస్తుతం ఈ వంతెనపై నుంచి ప్రజలు, వ్యాపారులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
పట్టించుకోని సమైక్య పాలకులు
ప్రాణహిత నదిని ఆనుకొని రెండు వైపులా ఉన్న ప్రాంతాల మధ్య ఆత్మీయ, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇరువైపులా ఉన్న తమ బంధువులను కలుసుకునేందుకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మర పడవల్లో నదిని దాటాల్సి వచ్చేది. నదిని దాటుతూ ప్రాణాలు పోతున్నా, నాటి సమైక్యపాలకు లు ఏనాడూ పట్టించుకోలేదు.. తెలంగాణ ప్రభుత్వం ప్రజలు అనాధిగా పడుతున్న బాధలను గుర్తించి, భారీ వంతెన నిర్మాణాన్ని చేపట్టింది.
తీరిన వెతలు..
చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద నిర్మించిన వంతెనతో ప్రాణహిత అవతలి వైపున కనిపించే మహారాష్ట్ర పరిధిలోని వంగెపెల్లికి రహదారి సదుపాయం కలిగింది. అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు వెళ్తే మహారాష్ర్టాలోని అహేరి, అల్లెపెల్లి పట్టణాల మీదుగా వెళ్లే హైవే వస్తుంది. వంతెన నిర్మాణం పూర్తి కావడంతో బంధుత్వాలు బలపడడంతోపాటు వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెరుగుతున్నాయి. చింతలమానేపల్లి మండల కేంద్రం నుంచి ఐదు కిలోమీటర్లలోపే మహారాష్ట్రలోని హైవే వస్తుంది. దీంతో కుమ్రం భీం ఆసిఫాబాద్తోపాటు మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం కలిగింది. వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగవుతున్నాయి. వంతెన నిర్మాణానికి ముందు రోజు సుమారు 500 మంది నాటు పడవల్లో రాకపోకలు సాగించేవారు. ప్రాణ హితకు అవతలివైపున ఉన్న గ్రామాల్లో సంతలు నిర్వహించే రోజుల్లో అయితే 2 వేల మందికి పైగా రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతం వంతెన నిర్మాణంతో వ్యాపారులు, ప్రజలు సాఫీగా రాకపోకలు సాగించే వీలు కలిగింది.
నాటు పడవ ప్రమాదాలు
- 2005లో సిర్పూర్(టీ) మండలం హడ్కిలి గ్రామ సమీపంలో నదిలో నాడుపడవలో ఇసాక్ ఫాతీమా, షహనాజ్ అహ్మద్ విహార యాత్రకు వెళ్లారు. పడవ బోల్తాపడడంతో వారిద్దరూ మృత్యువాత పడ్డారు.
- 2011లో కౌటాల మండలం వీరవెల్లి గ్రామానికి చెందిన 11 మంది మహారాష్ట్రలోని తమ బంధువుల ఇంట్లో జరిగే వివాహానికి వెళ్తుండగా నదిలో పడవ బోల్తాపడి ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో చంద్రె పరుశురాం, చంద్రె భీంరావు, చంద్రె భగవాన్, చంద్రె శ్రీకాంత్, చంద్రె నిర్మలాబాయి తో పాటు పడవ నడిపే బావునే మల్కు జలసమాధి అయ్యారు. మరో ఐదుగురు అతికష్టం మీద ప్రాణాలతో ఒడ్డుకు చేరారు.
- 2016లో కౌటాల మండలంబలోని తుమ్మిడి హెట్టి వద్ద నాటు పడవ బోల్తాపడి మంచిర్యాల హమాలీవాడకు చెందిన బారె వెంకటేశ్, అతని కుమారుడు రాజు, మమత మృతి చెందగా, సురేశ్, ధర్మేందర్, సాయిరాం, పడవ నడిపే వ్యక్తి భీమయ్య ప్రాణాలతో బయటపడ్డారు.
- 2019 డిసెంబర్లో కాగజ్నగర్కు చెందిన బీట్ అధికారి బాలకృష్ణ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిలో పడవ మునిగి చనిపోయాడు. కెరమెరికి చెందిన మరో బీట్ అధికారి సురేశ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇలా ప్రాణహిత నది దాటుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

