Sitaare Zameen Par | ఉట్నూర్ : ఐటీడీఏ ఉట్నూర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘వికాసం పాఠశాల’.. అంధులు, మౌనవికులు, చలన వికలాంగులు, ఆటిజం ఉన్న ప్రత్యేక అవసరాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన పాఠశాల. ఈ పాఠశాల విద్యార్థులంతా ఒక హృద్యమైన, స్పూర్తిదాయకమైన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి శ్రీమతి ఖుష్బూ గుప్తా ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో “సితారే జమీన్ పర్” ప్రేరణాత్మక చిత్రం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు.. ఈ చిత్రం ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల మనోభావాలను, సృజనాత్మకతను, వారి లోతైన ప్రపంచాన్ని స్పృశించే విధంగా రూపొందించబడింది.
ఈ చిత్రాన్ని వికాసం పాఠశాల విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ.. ‘ఇలాంటి చిత్రాలు సమాజంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల మరింత సహానుభూతి, అవగాహనను పెంపొందిస్తాయి. ఇది కేవలం వినోదాత్మక అనుభవం మాత్రమే కాకుండా.. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది వంటి ప్రతీ ఒక్కరిలో మానవీయత, అవగాహన, పరస్పర సంభాషణకు దారితీసే మార్గంగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 539 మంది విద్యార్థులు, ఆశ్రమ పాఠశాల బాలురు, బాలికలు పాల్గొన్నారు. అదనంగా ఆదిలాబాద్ ATDO, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇతర అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ ఉట్నూర్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ ప్రత్యేక అవసరాలు ల విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలియజేశారు.
High Court | మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి : తెలంగాణ హైకోర్టు ఆదేశం
Gupta Nidhulu | గుప్తనిధుల కోసం ఆంజనేయ స్వామి ఆలయంలో తవ్వకాలు
cricket tournament | యువత క్రీడల్లో రాణించాలి.. క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన చల్మెడ