ఆసిఫాబాద్ : ఫోన్ టాపింగ్ నెపంతో కేసీఆర్ ( KCR ) ను విచారణకు పిలవడం కక్ష సాధింపు చర్య అని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి( MLA Kova Laxmi ) , జిల్లా మున్సిపల్ ఇన్చార్జి , ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్( MLC Dasoju Sravan Kumar ) ఆరోపించారు. బీఆర్ఎస్ అధిష్టానం పిలుపుమేరకు ఆదివారం ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. నల్ల జెండాలతో రోడ్డుపై బైటాయించి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు.కేసీఆర్కు పంపిన సిట్ నోటీసులు బూటకమని పేర్కొంటూ, ఆ నోటీసుల కాపీలను తగులబెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.తెలంగాణ సాధకుడిపై జరుగుతున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.