కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ చింతలమానెపల్లి, మే 25 : కేసీఆర్ పదేళ్ల పాలనలో సిర్పూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రైతులకు ఎంతో మేలు జరిగిందని, అటవీ అధికారుల వేధింపులు ఉండేవి కావని సిర్పూర్ మాజీ ఎమ్మె ల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం చింతలమానేపల్లి మండ లం డబ్బా గ్రామంలో చింతలమానేపల్లి, కౌటాల, బెజ్జూర్, పెంచికల్ పేట్ మండలాల్లోని తన అనుచరులతో కలిసి బీఎస్పీ నేత ప్రస న్న హరికృష్ణతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌ల సహకారంతోనే సిర్పూర్ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించానన్నారు. కాంగ్రెస్ పాలనలో ధాన్యాన్ని కొనే నాథుడు లే క రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో రైతుల కు పోడు పట్టాలు ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటవీ అధికారుల వేధింపులు రైతులపై ఎక్కువయ్యాయ ని, దిందా గ్రామంలో రైతులు సాగుచేసుకుంటున్న 300 ఎకరాలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. పెంచికల్పేట్ మండలం జైహింద్‌పూర్‌లో అటవీ అధికారుల వేధింపులు తాళలేక లచ్చన్న అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుబడి పోతుందన్నా రు. తాను కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఇంత వరకు ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొనలేదని, ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉం టూ వస్తున్నానని, తనకు కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధంలేదని తెలిపారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి జరిగింది, అనేక పథకాలతో రైతులకు మేలు జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు, గంగాపూర్, పాపన్‌పేట్, కో ర్సిని గ్రామాల్లో తాగునీటి కోసం బోర్లు కూడా వేయనివ్వడం లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లతో ఎలాంటి విబేధాలు లేవన్నారు. ని యోజకవర్గ అభివృద్ధి కోసం ఏ పార్టీ జెండానైనా పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కమీషన్ల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. మారుమూల గ్రామాల్లో అభివృద్ధి కోసం కృషి చేయకుండా కేలం కమీషన్ల కోసమే ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధిపై నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. సుమారు ఐదు నెలల క్రితం కౌటాల మండలం వీర్థండిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్‌పై తిరుగబడ్డారు. కేసీఆర్ పాలనతో ప్రాణహితపై రూ. 75 కోట్లతో మంజూరైన వంతెన నిర్మాణాన్ని ఎందుకు రద్దు చేశారో ప్రజ లు ప్రశ్నించాలన్నారు. కాగా, ఆనాడు కోనేరు కోనప్పచేసిన ఆరోపణలపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను హైదరాబాద్‌కు పిలిపించి సమదాయించారు. కోనేరు కోనప్ప కోరుకున్న విధంగా అభివృద్ధి పనులు చేస్తానని హామీ ఇవ్వడంతో ఆయన శాంతించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హామీలు నెరవేరుస్తారని ఇంతకాలం ఎదురుచూసిన కోనేరు కోనప్ప మరోసారి తిరుగుబాటపట్టారు. మళ్లీ బీఆర్ఎస్లో చేరుతారా అని విలేకరులు అడుగగా రాజకీయాల్లో ఏదైనా జరుగవచ్చని, నియోజకవర్గ అభివృద్ధి కోసం తను ఏ పార్టీ జెండానైనా పట్టుకుంటానని బదులిచ్చారు.