సీసీసీ నస్పూర్, జూన్ 15: సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించాలని, కార్మికులకు లాభాల్లో నుంచి 35 శాతం వా టా చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నస్పూర్‌లోని మంచిర్యాల బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి అధ్యక్షతన శ్రీరాంపూర్ ఏరియా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. నిర్వహించారు.
రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మా దాసు రామ్మూర్తి, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు నూనె కొమురయ్య, సంయుక్త కార్యదర్శి పానుగంటి సత్తయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అన్వేష్‌రెడ్డి పాల్గొన్నారు. మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో పెట్రేగిపోయిన రాజకీయ జోక్యాన్ని తగ్గించాలన్నారు.
మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని, సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని సంస్థలోని అన్ని సింగరేణి హాస్పిటళ్లలో మందులు అందుబాటులో ఉంచాలని, కార్మికులకు రెఫరల్ సౌకర్యాన్ని సులభతరం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి వచ్చిన లాభాలను యాజమాన్యం వెంటనే ప్రకటించాలన్నారు. ఈ మధ్యలో వచ్చిన బదిలీల సర్క్యులర్ ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని, వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడిగా బండి రమేశ్
శ్రీరాంపూర్ ఏరియా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడిగా బండి రమేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీరాంపూర్ ఏరియా నుండి వచ్చిన ముఖ్య కార్యకర్తలు, అన్ని గనుల పిట్, అసిస్టెంట్ సెక్రటరీలు పాల్గొని బండి రమేశ్‌కు మద్దతు నిలిచారు. అనంతరం ఇది వరకు శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడిగా సేవలు అందించిన పెట్టం లక్ష్మణ్‌ను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కొత్తగా ఎన్నికైనా బండి రమేవ్కు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ఇన్చార్జి గోగుల రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.