నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 5 : ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హనుమాన్ జయంతి ఉత్సవాలను జిల్లా కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు ఆంజనేయస్వామి ఆలయాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. నిర్మల్ నియోజక వర్గంలో 600లకు పైగా ఆలయాలకు పూర్వ వైభవం తీసుకువచ్చామని చెప్పా రు. ఒకప్పుడు నిరాదరణకు గురైన ఆలయాల్లో ప్రస్తుతం నిత్య పూజలు కొనసాగుతున్నాయన్నా రు. ప్రతీ గ్రామంలో ఏదో ఒక ఆలయాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. నేటి యువత ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపడం శుభ పరిణామమని అన్నారు. అనంతరం మంత్రి రెడ్డి భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఆయా ఆలయ కమిటీల బాధ్యులు మంత్రిని సన్మానించారు. పట్టణంలోని బాలాజీ వాడ వీరాంజనేయ స్వామి ఆలయంలో దాతలు ఆమెడ హైమావతి- సత్యనారాయణ నిర్మించిన వంటశాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలను అభినందించారు. కార్యక్రమం లో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ దర్మాజీ రాజేందర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు గండ్రత్ రమణ, తులసీ నర్సాగౌడ్, కొండ సబితా శ్రీధర్, గండిరామన్న ఆలయ ట్రస్టీ లక్కాడి జగన్మోహన్ రెడ్డి, నాయకులు అడ్ప పోశెట్టి, ఆమెడ శ్రీధర్, అంగ జగదీశ్ పాల్గొన్నారు.
దాతలు సాయం అందించాలి
సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీకి దాతలు తమ వంతు సాయం అందించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. మంత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ సొసైటీకి వ్యాపార వర్గాల వారికి అవగాహన కల్పించడం తో నిధులు సమకూర్చేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ ప్రవీణ్ కుమా ర్ తెలిపారు. ఇటీవల కొంత మంది దాతలు ఇచ్చిన విరాళాలకు సంబంధించిన రూ.30 లక్షల చెక్కును మంత్రి ఐకేరెడ్డికి క్యాంపు కార్యాలయం లో ఎస్పీ గురువారం అందించారు. పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీకి ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు ఉంటుందన్నారు. నిధుల మంజూరుకు సహకరిం చిన మంత్రికి జిల్లా పోలీస్ శాఖ తరఫున ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.
నేటి నుంచి అంబలి పంపిణీ
పట్టణంలోని విశ్రాంతి భవనం ఎదుట పాకాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాకాల రాంచందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి, చలివేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు. కొన్నేళ్లుగా పట్టణంలో పాకాల రాంచందర్ ఉచితంగా అంబలి అందిస్తున్నారు.
ఎల్లపెల్లి ఆలయంలో పూజలు
సోన్, ఏప్రిల్ 6 : నిర్మల్ మండలం ఎల్లపెల్లి ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అల్లోల రవీందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, మహేశ్ రెడ్డి ఉన్నారు.