చెన్నూరు రూరల్ : రాష్ట్ర బడ్జెట్లో రేవంత్ రెడ్డి సర్కార్ విద్యా రంగానికి తీవ్ర అన్యాయం చేసిందని చెన్నూర్ బీఆర్ఎస్వీ (Chennur BRSV) టౌన్ అధ్యక్షుడు నాయబ్ ఖాన్ ఆరోపించారు. అసెంబ్లీ ( Assembly ) ముట్టడి పిలుపులో భాగంగా చెన్నూర్ పోలీసులు ( Police ) పట్టణ బీఆర్ఎస్వీ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా నాయబ్ఖాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 7.53 శాతమే కేటాయించి విద్యారంగాన్ని ప్రభుత్వం ఎంతగా నిర్లక్ష్యం చేస్తుందో అర్థమవుతుందని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు రూ 8వేల కోట్లు విద్యార్థులకు బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. \కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎనగందుల ప్రశాంత్ కుమార్ ,తిరుపతి, సురేష్, కమటం మనోహర్, రెవెల్లి రాజు పాల్గొన్నారు.