తాండూర్ : మండలంలోని అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల మైదానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్( School Games Fedaration) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్-17 బాలికల కబడ్డీ సెలక్షన్స్ ( Kabaddi Selections ) అండ్ టోర్నమెంట్ను నిర్వహించారు.
ఈ టోర్నమెంట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, కొమురం బీం ఆసిఫాబాద్, మంచిర్యాల జట్లు పాల్గొన్నాయని పోటీల నిర్వహణ కార్యదర్శి సాంబమూర్తి తెలిపారు. ఈ టోర్నమెంట్లో మొదటి స్థానం నిర్మల్ జిల్లా జట్టు, రెండవ స్థానంలో ఆసిఫాబాద్ జట్టు, మూడవ స్థానంలో మంచిర్యాల జిల్లా జట్టు విజేతలుగా నిలిచాయి.
ఎంపికైన జట్లు ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఏడుల్ల బయ్యారంలో జరగబోయే అండర్-17 రాష్ట్రస్థాయి బాలబాలికల కబడ్డీ టోర్నమెంట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరపున పాల్గొంటారని వెల్లడించారు. ఈ సందర్భంగా నాయకులు సూరం రవీందర్ రెడ్డి క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేశారు.
స్కూల్ అసిస్టెంట్ శ్రీనివాస్ కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ సృజన్ కుమార్ గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఉమాదేవి, మండల విద్యాధికారి ఎస్ మల్లేశం, టోర్నమెంట్ అబ్జర్వర్ ఫిజికల్ డైరెక్టర్ సిరంగి గోపాల్, ఆసిఫాబాద్ జిల్లా టీజీ పేట అధ్యక్షులు ఏవి రామ్మోహన్, పీఈటీ, పీడీలు గాజుల శ్రీనివాస్, మేకల రాజయ్య, స్టీఫెన్ రవీంద్ర, విజయ్ చందర్, శారద, ప్రేమలత పాల్గొన్నారు.