సిరికొండ, ఫిబ్రవరి 10 : మండలంలోని పొన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి డోబ్లే రుషికేశ్ ఆదిలాబాద్ జిల్లా నుంచి జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం రామకృష్ణ తెలిపారు. ఈ విద్యార్థి రైల్వే ప్రయాణంలో దివ్యాంగులు, మహిళలు, పిల్లలకు ఇబ్బందులు క లుగకుండా సౌకర్యవంతమైన ప్రయాణం కోసం రైల్వే కోచ్ ప్రాజెక్టును రూపొందించాడని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్‌కు దీటుగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఎంఈవో ఉదయ్‌రావ్, సర్పంచ్ చంద్రకళ, ఉపాధ్యాయులు సిబ్బంది అభినందించారు.
తలమడుగు, ఫిబ్రవరి 10 : ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ పోటీల్లో మండలంలోని దేవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఎం.మౌనిక ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికైంది. ‘మిషన్ భగీరథ వాటర్ డిటెక్టివ్ కా షన్ అలారం’ అనే పరికరం తయారు చేసింది. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘మిషన్‌భగీరథ నీరు ఇంటి ట్యాప్లోకి వచ్చింది..ఆన్ చేసి పట్టుకోండి’ అనే అంశాన్ని ప్రదర్శించింది. పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు బీ రమేశ్ మార్గదర్శకత్వం లో ప్రాజెక్ట్‌ను రూపొందించారు. జాతీయ పోటీల్లో మౌనిక ప్రతిభకనబర్చడంతో డీఈవో ప్రణీత, జిల్లా సైన్స్ అధికారి రఘురమ ణ, హెచ్ఎం ఓ రమేశ్, సర్పంచ్ ఫాతిమా, చైర్మన్ సుజాత, వైస్ చైర్మన్ మోహన్, గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు.
మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 10 : 2020-21నేషనల్ లెవల్ ఇన్స్పైర్ పోటీలకు జిల్లా విద్యార్థిని ఎంపికైనట్లు డీఈవో వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల రాష్ట్రస్థాయి లో జరిగిన ఆన్లైన్ పోటీలకు అన్ని జిల్లాల నుంచి 365 ప్రాజెక్టులు రాగా, ఇందులో జిల్లాకేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ ఏడో తరగతి విద్యార్థిని ఎస్ సాయి శ్రీవల్లి ప్రాజెక్టు ఎంపికైనట్లు తెలిపారు. ఏప్రిల్‌లో జరగనున్న నేషనల్ పోటీల్లో శ్రీవల్లి పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
మహిళలకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరమని రూపకర్త, విద్యార్థిని శ్రీవల్లి తెలిపారు. రుతుస్రావ సమయంలో నొప్పిని తగ్గించి సురక్షితంగా ఉంచేలా ఈ ప్రాజెక్టు ఉపయోగపడనున్నదని పేర్కొన్నారు. దీని ద్వారా ఉపయోగించిన ప్యాడ్స్‌ను సులభంగా, శుభ్రంగా భద్రపర్చుకోవచ్చని, అంతేగాకుండా సులభంగా మార్చుకునే వీలుంటుందని పేర్కొన్నారు. దీనిని రెండు గిన్నెలు, బుట్ట, తీగను ఉపయోగించి తయారు చేశానని, ఈ టూల్ కిట్ ద్వారా కడగడమే కాకుండా, ఉపయోగించిన ప్యాడ్స్‌ను సులభంగా ఆరబెట్టుకోవచ్చన్నారు. గైడ్ ఉపాధ్యాయుడు రమేశ్, తల్లిదండ్రులు ఉమ-మధుబాల సలహాలు సూచనలతో ఈ పరికారం తయారు చేసినట్లు ఆమె వివరించారు.