నర్సింహులపేట, ఫిబ్రవరి 20 : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. జయపురం గ్రామానికి చెందిన రాసమల్ల శృతి.. ఈ నెల 24 నుంచి మార్చి 1 వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని భండెల్ హుగ్లీబ్లూలో జరిగే 46వ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైంది. ఇదే గ్రామానికి చెందిన మందుల మమత రాష్ట్ర స్థాయి జట్టు తరుపున మార్చి నెలలో ఒడిశా రాష్ట్రంలో జరిగే వాలీబాల్ పోటీల్లో పాల్గొంటుందని రిటైర్డ్ పీఈటీ వీరారెడ్డి తెలిపారు.