బజార్ హత్నూర్: మండలంలోని గ్రామపంచాయతీలలో ఎలాంటి ఆర్థిక పరమైన పనులు చెయ్యమని మండల పంచాయతీ కార్యదర్శులు సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాస్‌కు వినతిపత్రం పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పంచాయతీ కార్యదర్శుల జేఏ సీ సంఘం అధ్యక్షుడు గంగా సాగర్ మాట్లాడుతూ.. పంచాయతీలోని ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ, మోటర్ రిపేర్ వీధి దీపాల ఏర్పాటు గడ్డి మందు కొనటం లాంటి ఆర్థిక పరమైన పనులు పంచాయతీ కార్యదర్శులు చేయమని ఎంపీడీఓకు చెప్పామన్నారు.
అలాగే ప్రభుత్వం గ్రామపంచాయతీలలో ఆగస్టు 2024 నుంచి ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న చెక్కులు క్లియర్ చేయాలని కోరమన్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్ కోసం ఖర్చు చేసిన నిధులను విడుదల చేయాలని, గత 18 నెలలుగా ప్రభుత్వం గ్రామపంచాయతీ అవసరాల కోసం నిధులు విడుదల చేయలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో మహేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, షబానా, నవనీత, శంకర్, ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.