కుంటాల, జూన్ 11 : కుంటాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల అనుబంధ వసతి గృహాన్ని బుధవారం తహసీల్దార్ కమల్‌సింగ్ పరిశీలించారు. పాఠశాలలు, హాస్టల్స్‌ను పునః ప్రారంభానికి ముందు శుభ్రపరిచి, విద్యార్థుల స్వాగతానికి ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించినప్పటికీ శుభ్రపరచకపోవడాన్ని తహసీల్దార్ గమనించారు.
హాస్టల్లోని టాయిలెట్లు అపరిశుభ్రంగా, దుర్గంద భరితంగా ఉండడం, తాగునీటి ట్యాంకు శుభ్రం చేయకపోవడం, తరగతి గదులు శుభ్రం చేయకపోవడం, పాఠశాల ఆవరణలోని చెట్ల పొదలను క్లియర్ చేయకపోవడం వంటి అంశాలు కనుగొన్నట్టు తెలిపారు. తనిఖీ సమయంలో హాస్టల్ ఇన్చార్జి, వార్డెన్ లేకపోవడంతో తహసీల్దార్ అసహనం వ్యక్తం చేశారు. నివేదికను పైఅధికారులకు పంపనున్నట్టు పేర్కొన్నారు.