Adilabad | ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో ప్రభుత్వ వికాసం ఆశ్రమ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బాలబాలికలకు ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రాథోడ్ వికాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
అనుభవమున్న ఉపాధ్యాయ బృందంచే విద్యానందిచడం జరుగుతుంది అని తెలిపారు. చెవిటి-మూగ(బధిర), బుద్ధి మాంద్యత, అంధులు, శిశుపాక్షిక పక్షవాతం, స్పీచ్ థెరపీ, ఉచిత ఆడియో టెస్టు చేయడం జరుగుతుంది. బాలబాలికలకు ప్రవేశం ఉంటుందని పేర్కొ న్నారు. విద్యార్థులకు ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యునిఫాం, కాస్మొటిక్ చార్జీలు, భోజనం, వసతి సౌకర్యం కల్పించడం జరుగుతుందని, ఆసక్తిగల వారు సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు , పాస్ పోర్టు సైజ్ ఫొటోతో స్కూల్లో లేదా 9440085818,9553573420నంబర్లో సంప్రదించి దరఖాస్తు ఫారం పొంది పాఠశాలలో సమర్పించాలని సూచించారు.