నేరడిగొండ, జనవరి 26 : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు. ఆదివారం మండలంలోని వాంకిడి గ్రామంలో 4 పథకాల లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఒకప్పుడు వాంకిడి గ్రామ పంచాయతీ చాల పెద్దది అని, కానీ కేసీఆర్ వచ్చాక గ్రామాల్లో మెరుగైన పాలన జరగాలని కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారన్నారు. 161 మందికి ఇందిరమ్మ ఇళ్లు, 86 మందికి రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో అర్హులైన వారందరిని ఎంపిక చేయాలన్నారు. ఈ పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వినర్ అల్లూరి శివారెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ జడ్పీటీసీ సయ్యద్ జహీర్, అంబేకర్ పండరి, మండల ప్రత్యేకాధికారి రవికుమార్, ఎంపీడీఓ రజ్వీర్, ఎంపీవో లక్ష్మణ్, ఎంఏవో కృష్ణవేణి, ఏపీయం ఉత్తం, మహిళా సంఘ అధ్యక్షురాలు వనజ, వీడీసీ చైర్మన్ నవీన్, మాజీ సర్పంచ్ రాజు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కుంటాల, జనవరి, 26 : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్యారెంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ సర్కారుపై ప్రజాగ్రహం తప్పదని అర్హులందరికీ పథకాలు అందించాలని ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ అన్నారు. ఆదివారం కుంటాల మండలంలోని విఠాపూర్ గ్రామంలో లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొందరికే ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఊరుకునేది లేదన్నారు. దశలవారీగా లబ్ధిదారులకు పథకాలు అందించకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఆత్మీయ భరోసాలో అవకతవకలు ఉన్నాయని భూమిలేని ప్రతి కూలీకీ ఆత్మీయ భరోసా ద్వారా ఆదుకోవాలని అన్నారు. భైంసా పట్టణంలో వ్యవసాయ కూలీలున్నారని, వారికి సైతం పథకం వర్తించేలా చూడాలన్నారు. ఉపాధిహామీకి, ఆత్మీయ భరోసాకు లింకు పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్, తహసీల్దార్ ఎజాజ్ ఖాన్, ఎంపీడీవో లింబాద్రి, ఎంపీవో రహీం, డీటీ నరేశ్‌గౌడ్, ఎంఏవో విక్రమ్, ఏపీవో నవీన్, సిబ్బంది పాల్గొన్నారు.
బోథ్ (ఇచ్చోడ), జనవరి 26 : అర్హులందరికీ ప్రభుత్వ సక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని నవేగాం గ్రామంలో నిర్వహించిన నాలుగు పథకాల లబ్ధిదారులకు ప్రొసిడింగ్‌లను అందించారు. ఈ కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్ మాలవియ, జడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, ఎంపీడీవో లక్ష్మణ్, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు పాండు, గ్రామస్తులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని రిమ్మ గ్రామంలో నాలుగు పథకాల ప్రొసిడింగ్ కాపీలను డీఎల్పీవో ఫణిందర్, తహసీల్దార్ తుకారాం, ఎంపీడీవో రవీందర్ అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు రఘురాం, అనిల్, ఎస్ఐ శివరాం, నాయకులు ఇమామ్, అమృత్‌రావ్ పాల్గొన్నారు.
జైనథ్, జనవరి 26 : ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్న అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజా పాలన గ్రామసభలో భాగంగా ఆదివారం మండలంలోని పిప్పర్వాడలో ఏర్పాటు చేసిన గ్రామసభకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడుతగా ఆయా మండలాల్లోని 17 గ్రామాల్లో ఈ కార్యక్రమం ఈ రోజు కొనసాగుతుందన్నారు. అనంతరం లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జే భాసర్, తహసీల్దార్ శ్యాం సుందర్, ఎంపీడీవో రవీంద్రనాథ్, డీటీ రాజేశ్వర్, మారెట్ చైర్మన్ ఎ.అశోక్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ఎ.రుకేశ్ రెడ్డి ఎంపీవో వెంకట్రాజ్, ఏపీఎం భగవాండ్లు, మాజీ సర్పంచ్ సంతోష్ రెడ్డి, ఎంపీటీసీ ప్రశాంత్, ఏవోలు పూజ, అష్రఫ్ అహ్మద్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాంసి, జనవరి 26 : తాంసి మండలంలోని హస్నాపూర్ రైతు వేదికలో కలెక్టర్ ఆయా పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులు కలెక్టర్‌కు వినతి పత్రాలు అందించారు. అర్హులకు పథకాలు అందేలా దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి వెంకటరమణ, ఎంపీడీవో మోహన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, వ్యవసాయ అధికారి రవీందర్, ఎస్సై రాధిక, మాజీ సర్పంచ్ అలాలి జ్యోతి నర్సింగ్ , నాయకులు రాంచందర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జనవరి26 : మండలంలోని ఘట్టేపల్లిలో లబ్ధిదారులకు ప్రొసిడింగ్ పత్రాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, ఐటీడీఏ పీవో ఖుష్భుగుప్తాతో కలిసి సంక్షేమ పథకాల పత్రాలు అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో రాథోడ్ రవీందర్, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో భాస్కర్, ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తం, ఎంపీవో జీవన్‌రెడ్డి, ఈజీఎస్ ఏపీవో జాదవ్ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం రాథోడ్ రామారావ్, గ్రామస్తులు కుమ్ర మోహన్రావ్, పవార్ దూద్‌రాం, ఆత్రం గోవింద్‌రావ్, కుమ్ర రాంషావ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, జనవరి 26: మండలంలోని పెద్ద సుద్దగూడ 4 పథకాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రొసిడింగ్ పత్రాలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బు గుప్తాతో కలిసి అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సుధాకర్, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో రాంప్రసాద్, ఎంపీవో సుదార్శన్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ జైవంత్‌రావు, ఏపీవో రజినీకాంత్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు ఆత్రం తిరుపతి, రాధాబాయి, వెడ్మ కొద్దు, అధికారు, గ్రామస్తులు పాల్గొన్నారు.