అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నిర్మల్, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ పర్యటించారు. గడిచిన 45 రోజుల్లో ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమిపూజ చేశారు.
ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ తీపికబురు అందించారు. ఎన్నికల ప్రచారానికి ఈనెల 15 నుంచి ఆయనే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. 15 రోజుల్లో 42 సభలు నిర్వహించేలా కార్యాచరణ ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆరు నియోజకవర్గాల్లో సీఎం ప్రచార సభలు ఉండనున్నాయి. నవంబర్ 2 న నిర్మల్, 3న ముథోల్ నియోజకవర్గాలకు సీఎం రానున్నారు. అనంతరం 7వ తేదీన చెన్నూర్, 8వ తేదీన సిర్పూర్ కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో సభలు నిర్వహించనున్నారు.
– మంచిర్యాల, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నవంబర్ 2 : నిర్మల్
నవంబర్ 3 : ముథోల్(భైంసా)
నవంబర్ 7 : చెన్నూర్
నవంబర్ 8 : ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి