కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం జంగుగూడకు చెందిన వెడ్మి కిషన్ ఇటీవల మృతి చెందగా ఎస్ బీఐ(SBI) ప్రమాద బీమా ఉండడంతో రూ.10 లక్షల 10 వేల ప్రమాద బీమా చెక్కును(Insurance Cheque) కిషన్ తల్లి వెడ్మ బాదు బాయి, భార్య వెడ్మ సుమలతకు అందజేశారు. ఎస్బీఐ చీఫ్ మేనేజర్ పూసర్ల కిరణ్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ చహకటి యాదవరావు చేతుల మీదుగా చెక్కును అందించారు.
ఏప్రిల్ 9న విద్యుత్ ప్రమాదంలో జంగు మృతి చెందగా ప్రమాద బీమా ఎస్బీఐ ఉండడంతో క్లైమ్ చేసి అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ క్యాషియర్ సాయి ప్రీతమ్, ఆదానీ కంపెనీ హెచ్ఆర్ జీఎం కులకర్ణి, ఆదివాసీ సంఘాల నాయకులు ఆడే జంగు, పెంద్రం హన్మంతు, తిరుపతి రెడ్డి, రొడ్డ కిష్టయ్య, కనక గోవర్ధన్, మడావి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.