కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షాలతో గ్రామాల్లో అపరిశుభ్ర వా తావరణం నెలకొనడంతో దోమలు, ఈగలు వృద్ధి చెందడం, నీటి వనరుల్లో కలుషిత నీరు చేరడంతో ప్రజలకు వ్యాధులు వ్యాపిస్తున్నా యి. జిల్లాలో 63 మలేరియా, టైఫాయిడ్ ప్రభావిత గ్రామాలను అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు జిల్లాలో 195 డయేరియా, 36 టైఫాయిడ్, 8 మలేరియా, 2 డెంగీ కేసులను అధికారులు గుర్తించారు.
వాంకిడి పీహెచ్సీ పరిధిలో 3, లోనవెల్లి పీహెచ్సీ పరిధిలో 3, జైనూర్, గిన్నెధరి పీహెచ్సీల పరిధిలో 2 మలేరియా కేసులు, భట్పల్లి పీహెచ్సీలో 1, ద హెగాం పీహెచ్సీల పరిధిలో డెంగీ కేసు నమోదైంది. వర్షాకాలంలో వ్యాపించి వ్యాధుల అదుపునకు వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు సరిగా నిర్వహించకపోవడంతో వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
జిల్లాలో 63 ప్రభావిత గ్రామాల గుర్తింపు
జిల్లాలో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాపించే 63 ప్రభావిత గ్రామాలను అధికారులు గుర్తించి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. వ్యాధులు విజృంభించకుండా ఈ గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కేసు నమోదైన గ్రామంలో దోమల నివారణకు మందు పిచికారీ చేయడంతో పాటు, ఆ గ్రామంలోని వారందరికీ ప్రత్యేకంగా రక్త పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
పారిశుధ్య పనులు చేపట్టడం, కలుషిత నీరు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో టైఫాయిడ్, డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో అధికారులు ఏజెన్సీ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తున్నది. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టని వైద్య శాఖ వ్యాధులు విజృంభించిన తర్వాత నివారణ చర్యలు చేపట్టడంపై విమర్శలు వస్తున్నాయి.
91 గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి
వర్షాకాలం వచ్చిందంటే వైద్య సేవలు అం దించేందుకు వెళ్లేందుకు వీలుకాని 91 గ్రామాలను వైద్యాధికారులు గుర్తించారు. ఈ గ్రామాలకు సరైన రోడ్లు లేకపోవడం, వాగులపై వంతెనలు లేకపోవడంతో ఆ గ్రామాలకు వెళ్లలేమని అధికారులు గుర్తించారు. తిర్యాణి, లింగాపూర్ వంటి మారుమూల గ్రామాలతో పాటు ఆసిఫాబాద్ మండలంలోని గ్రామాలు కూడా వర్షాకాలంలో వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి.
వర్షాకాలంలో రాకపోకలు సరిగా లేని ఈ 91 గ్రామాల్లో వ్యాధులు వ్యాపిస్తే ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్షాకాలంలో వైద్య బృం దాలు వెళ్లలేని గ్రామాల్లోని గర్భిణులను ప్రసవ తేదీలకంటే వారం, పది రోజుల ముందే హాస్పిటల్కు తీసుకువస్తున్నామని, లేదా హాస్పిటల్ సమీపంలో ఉన్న బంధువుల ఇండ్లల్లో ఉంచుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యాధికారి తుకారాం భట్ తెలిపారు.
పారిశుధ్య పనులు అస్తవ్యస్తం..
వ్యాధులు ప్రబలడానికి గ్రామాల్లో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణ పరిస్థితులే కారణమని తెలుస్తున్నది. సర్పంచులు లేకపోవడం, ప్రత్యే కాధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు గ్రామాల వైపు రాకపోవడంతో పారిశుధ్య పనులను ఎవరూ పట్టించుకోవడం లే దు. దీంతో మురుగు కాలువలు నిండిపోవ డం, రోడ్లపై చెత్తాచెదారం పేరుకుపోయి వ్యా ధులు విజృంభించేందుకు కారణమవుతున్నా యి.
ప్రత్యేక అధికారులు మండల కేంద్రాల్లో తప్ప గ్రామాలను పట్టించుకోవడం లేదనే వి మర్శలున్నాయి. సీజనల్ వ్యాధుల నివారణకు వైద్య ఆరోగ్య శాఖతోపాటు, పంచాయతీరాజ్, ఐసీడీఎస్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నప్పటికీ ఆ మేరకు క్షేత్ర స్థాయిలో పనిచేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.