ఎదులాపురం, మే 22 : రాష్ట్ర ప్రభుత్వం జొన్న పంటను ఎలాంటి నిబంధనలు లేకుండా వెంట వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న, రైతులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతి పత్రం అందజేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మారెట్ యార్డుకు వివిధ గ్రామాల నుంచి తీసుకొచ్చిన రైతులు తమ పంట కాంటా చేసిన లారీల్లో లోడింగ్ కాకపోవడంతో తమ పంటను అతి తొందరగా లారీల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్‌కు రూ.2500 నుంచి రూ. 2700ల వరకు, తకువ ధరకు విక్రయిస్తూ రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో రైతులు సంగెపు అమల్ రాజ్, రాజు, మధుసూదన్, భీమ్ రావు, విలాస్ పాల్గొన్నారు.