హాజీపూర్, మే 14 : పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలు సోమవారం ముగియగా, అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూంలలో ఉంది. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన వీవీప్యాట్లు, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంలను సోమవారం అర్ధరాత్రి భారీ బందోబస్తు నడుమ హాజీపూర్ మండ లం ముల్కల్ల శివారులోని ఐజా ఇంజినీరింగ్ కళాశాలకు తీ సుకొచ్చారు.
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. ఓట్ల లెక్కింపునకు మరో 20 రోజు లు గడువు ఉండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నా యి. ఎన్నికల సాధారణ పరిశీలకులు రావేశ్ గుప్త, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర బదావత్ సంతోష్, పోలీస్ పరిశీలకుడు మనీశ్ చౌదరి, డీసీపీలు అశోక్‌కుమార్, ప్రకాశ్, బెల్లంపల్లి ఏఆర్వో, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ (స్థానిక సంస్థలు), సభావత్ మోతీలాల్ (రెవెన్యూ), చెన్నూర్ ఏఆర్వో చంద్రకళ, మంచిర్యాల ఏఆర్వో, ఆర్డీవో రాములు సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ను సీజ్ చేశారు. లెక్కింపు కేంద్రం పరిసరాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలను చేశారు.