నిర్మల్ అర్బన్, డిసెంబర్ 14 : సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్స్‌ను నెరవేర్చి, తమను రెగ్యులర్ చేయాలని నిరసిస్తూ ఉద్యో గ, ఉపాధ్యాయులు చేపట్టిన నిరవధిక సమ్మె నిర్మల్‌లో ఉధృతంగా కొనసాగుతున్నది. నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం ఉద్యోగ, ఉపాధ్యాయులు స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట గల జాతీయ రహదారిపై మోకాళ్లపై కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ.. ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంగాదర్, రాజారత్నం, ఆనంద్, హరీశ్, స్పందన్, విజయ్, నవిత, వీణ, అపర్ణ, గంగామణి, ప్రభ, జ్యోతి, శ్రీతల దేవి, సాయినాథ్, వివేక్ రాజు నాయక్, నారాయణ పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సారూ.. మా మమ్మీ వాళ్ల సమస్యలను పరిష్కరించాలని ఓ చిన్నారి సీ ఎం రేవంత్‌రెడ్డి విగ్రహం వద్ద విలపించింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఐదు రోజులుగా స మగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలుపుతున్నారు. తన తల్లి లో కలిసి చిన్నారి నిరవధిక సమ్మెలో పాల్గొన్నది. సమ్మెకు పిల్లలతో తరలి వచ్చి మహిళా ఉద్యోగులు నిరసనలో పాల్గొంటున్నారు.