Mancherial | మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల ధర్నా.. ఆగిపోయిన బస్సులు.. ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు!
Mancherial | మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్లు ఉపయోగించే బ్రీతింగ్ ఎనలైజర్ (Breathalyzer) మిషన్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎనలైజర్ మిషన్లలో సాంకేతిక లోపాల వల్ల మద్యం సేవించని డ్రైవర్లకు కూడా 'పాజిటివ్' వస్తోందని, దీనివల్ల అనవసరమైన సస్పెన్షన్లు, జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని డ్రైవర్లు వాపోతున్నారు.
Mancherial | మంచిర్యాల అర్బన్, మే 11: మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్లు ఉపయోగించే బ్రీతింగ్ ఎనలైజర్ (Breathalyzer) మిషన్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మంచిర్యాల డిపోలో బ్రీతింగ్ ఎనలైజర్ మిషన్లు సరిగ్గా పనిచేయడం లేదని, మద్యం సేవించకపోయినా ‘పాజిటివ్’ అని చూపిస్తున్నాయని రెండురోజుల్లో ఇద్దరు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పాజిటివ్ రావడంతో డ్రైవర్లు కుటుంబ సభ్యులతో కలిసి డిపో ముందు సోమవారం ఉదయం నిరసనకు దిగారు.
ఎనలైజర్ మిషన్లలో సాంకేతిక లోపాల వల్ల మద్యం సేవించని డ్రైవర్లకు కూడా ‘పాజిటివ్’ వస్తోందని, దీనివల్ల అనవసరమైన సస్పెన్షన్లు, జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని డ్రైవర్లు వాపోతున్నారు. పాతబడిపోయిన, సరిగ్గా పనిచేయని మిషన్లను వెంటనే మార్చాలని, నాణ్యమైన, ఖచ్చితమైన ఫలితాలను ఇచ్చే కొత్త మిషన్లను అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Mancherial Rtc1
కాగా అకస్మాత్తుగా ఉదయం 3.30 నిమిషాల నుంచి ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలపడంతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసేది ఏమి లేక ప్రైవేట్ వాహనాలు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా చేసుకొని ప్రైవేటు వాహనాల వాళ్లు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

