ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ప్రసిద్ధ కేస్లాపూర్ నాగోబా దేవాలయ( Nagoba Temple ) అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.21 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ ( MLA Bojju Patel ) అన్నారు. గురువారం ఆలయ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. మంజూరైన రూ.21 కోట్ల నిధులతో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులపై చర్చించారు.
ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయానికి సుందరంగా తీర్చిదిద్దేలా పనులను చేపట్టాలని సూచించారు. ఇందులో భాగంగా ట్రైబల్ మ్యూజియం. డైనింగ్ హల్. వీఐపీ గెస్ట్‌హౌస్ నిర్మాణం, ఆలయ ముఖద్వారం అభివృద్ధి, ఆలయ పూజారిల కోసం గేస్ట్ హౌజ్, నాలుగు స్నానపు గదులు, నాలుగు సులాబ్ కాంప్లెక్స్ నిర్మాణం, కోనేరు పొడిగింపు, గార్డెన్ ఏర్పాటుతో పాటు ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయులు పీఠాధిపతి మెస్రం వెంకటరావ్ పటేల్, సర్పంచ్ లు మెస్రం తుకారామ్ రోహిదాస్, ఆలయ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్, ఎంపీడీవో మహేందర్, ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్, ఈఈ జాదవ్ తానాజీ, పీఆర్ డీఈ పవార్ రమేష్, ఐటీడీఏ డీఈ నవీన్, ఈవో రవికుమార్. మెస్రం వంశీయులు శేఖర్ బాబు. మెస్రం నాగ్ నాథ్. భాదిరావ్. లింబారావ్ తదితరులు పాల్గొన్నారు.