హైదరాబాద్ : కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకుల ప్రైవేట్ ప్రాపర్టీస్ ( Private Properties ) మీదకు వెళ్లడం దేశంలోనే తెలంగాణలో ప్రథమమని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ( Bigala Ganesh ) ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌస్, కేటీఆర్ , హరీశ్ రావు , జగదీశ్వర్ రెడ్డి , పైలట్ రోహిత్ రెడ్డి ప్రైవేట్ ప్రాపర్టీస్ మీదికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.
రైతాంగ సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికే డైవర్షన్ రాజకీయాలకు ప్రభుత్వం పాల్పడుందని పేర్కొన్నారు. ప్రైవేట్ ప్రాపర్టీస్‌పై తనిఖీలు, దాడుల అధికారం కాంగ్రెస్ నాయకులకు ఎవరిచ్చారని నిలదీశారు. వీళ్లేమన్నా ప్రభుత్వాధికారులా? లేకపోతే న్యాయస్థానం నియమించిన కమిషనా? అంటూ ప్రశ్నించారు. రాజకీయ కుట్రలను పక్కన పెట్టి రైతులను, తెలంగాణ ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.