AP News | వైసీపీ ఆందోలన నిరసనలా లేదు అరాచకంలా ఉంది : బుద్ధా వెంకన్న
AP News | విజయవాడలో వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళనలా ఎంతమాత్రం లేదని, అది నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అరాచక చర్య అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న మండిపడ్డారు. పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ అధినేత జగన్ ప్రజల్లో కావాలని విషప్రచారం చేస్తున్నారని, అయితే ఆయన అబద్ధాలను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని స్పష్టంచేశారు.
AP News : విజయవాడలో వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళనలా ఎంతమాత్రం లేదని, అది నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అరాచక చర్య అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న మండిపడ్డారు. పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ అధినేత జగన్ ప్రజల్లో కావాలని విషప్రచారం చేస్తున్నారని, అయితే ఆయన అబద్ధాలను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని స్పష్టంచేశారు. ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.
ప్రత్యేకించి స్పోర్ట్స్ కోటా కింద అర్హత సాధించిన క్రీడాకారులకు పారదర్శకంగా డీఎస్సీ ఉద్యోగాలు దక్కడంతో నిరుద్యోగ యువత ఎంతో ఆనందంతో ఉందని బుద్ధా వెంకన్న తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువత భద్రతకు, ఉపాధి కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంటే, అర్హులైన క్రీడాకారులకు న్యాయం జరగడాన్ని కూడా వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
విద్యా, ఉద్యోగ రంగాల్లో సంచలనాత్మక మార్పులు తీసుకొస్తూ యువతకు మెరుగైన భవిష్యత్తును అందిస్తున్న మంత్రి నారా లోకేశ్‌పై ఉన్న రాజకీయ అసూయతోనే వైసీపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు ఒడిగడుతోందని, ప్రభుత్వంపై బురదజల్లే కుట్రలను ప్రజలే స్వయంగా తిప్పికొడతారని హెచ్చరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

