KTR | ఉద్యమకారుడికి అండగా.. మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. వీడియో
ktr | సోమవారం తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ ముదిరాజ్ (51) కుమార్తె, కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఇప్పటికే బసవతారకం ఆసుపత్రిలో రెండు కీమోథెరపీలు పూర్తయ్యాయని తెలుసుకున్న కేటీఆర్ , తదుపరి చికిత్స గురించి ఆరా తీశారు.
KTR | కూకట్పల్లి షంషీగూడకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ ముదిరాజ్ (51) అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం మాజీ కార్పొరేషన్ చైర్మన్ పాటిమీది జగన్ మోహన్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో చిన్న వయసు నుంచే తెలంగాణ తల్లి వేషధారణలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న లక్ష్మణ్ కుమార్తె చంద్రికతోపాటు కుటుంబ సభ్యులతో ఇటీవల కేటీఆర్ ఫోన్లో మాట్లాడి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ భవన్లో లక్ష్మణ్ కుమార్తె, కుమారుడు కేటీఆర్‌ను కలిశారు. ఇప్పటికే బసవతారకం ఆసుపత్రిలో రెండు కీమోథెరపీలు పూర్తయ్యాయని తెలుసుకున్న కేటీఆర్ , తదుపరి చికిత్స గురించి ఆరా తీశారు.
మెరుగైన వైద్యం కోసం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్న సింధు హాస్పిటల్‌కు కేటీఆర్ రిఫర్ చేశారు. ఉద్యమకారుల కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పాటిమీది జగన్ మోహన్ రావులను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్సకు అవసరమైన సహకారం అందించాలని కేటీఆర్ సూచించారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రామన్న
ఉద్యమకారుడికి అండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRSకూకట్పల్లి షంషీగూడకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ ముదిరాజ్ (51) అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం మాజీ కార్పొరేషన్ చైర్మన్ పాటిమీది జగన్ మోహన్ రావు కేటీఆర్ గారి… pic.twitter.com/EdNiviVQBy
— BRS Party (@BRSparty) September 21, 2026
Read Also :
Jagadish Reddy | పంటలను ఎండబెడుతున్న పాపం కాంగ్రెస్‌దే : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
Project Cheetah | దేశంలో 8 నుంచి 52కు పెరిగిన చీతాల సంఖ్య.. ప్రాజెక్ట్ చీతా విజయవంతం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

