బూర్గంపహాడ్, సెప్టెంబర్ 21 : దెయ్యాన్ని వదిలించే పేరుతో వృద్ధురాలిపై దాడికి పాల్పడిన అమానుష ఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని జింకలగూడెంలో చోటుచేసుకుంది. ఈ ఘటన జూలైలోనే చోటుచేసుకోగా దీనికి సంబంధించి వీడియో తాజాగా వెలుగు చూడడంతో దావానంలా వ్యాపించింది. స్థానికుల వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈమెకు దెయ్యం పట్టిందని దెయ్యం వదిలితేనే ఆరోగ్యం కుదుట పడుతుందని కొందరు స్థానికులు ఈమెను చెట్టు ఎక్కించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ సంఘటనపై పోలీసులను వివరణ కోరగా ఘటన తమ దృష్టికి వచ్చిందని, కానీ ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.