ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్బీఐ ఏటీఎంలో (SBI ATM) చోరీ జరిగింది. శనివారం తెల్లవారుజామున ఆదిలాబాద్ పట్టణంలోని రామ్‌నగర్ కాలనీలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోకి చొరబడిన దుండగులు.. సీసీ కెమెరాలకు బ్లాక్ స్ప్రే కొట్టారు. అనంతరం గ్యాస్ కట్టర్‌తో మెషిన్‌ను కట్ చేసి డబ్బులు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు అధికారులకు విషయం తెలియజేశారు. అందులో నగదు ఎంత ఉందన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా చోరీకి ఏటీఎంను డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు స్వామి, సునీల్ కుమార్ పరిశీలించారు. క్లూస్ టీమ్ రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.