నార్నూర్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నార్నూర్ నుంచి గాదిగూడ కు వెళ్లే ప్రధాన రహదారి (Highway) గుంతల మయంగా ( Road Damage ) మారింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు గుంతలను తప్పించుకునే క్రమంలో ఇబ్బందులు పడుతున్నారు. గుంతల వద్ద వాహనం నడిపేటప్పుడు అదుపు తప్పితే ప్రమాదం జరగక తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి వేళ ప్రయాణం చేయాలంటేనే వాహనచోదకులు జంకుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోక ముందే ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ఉమ్మడి మండలం వాసులు కోరుతున్నారు.