నార్నూర్ : మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపైగల బ్రిడ్జి వద్ద రోడ్డు గుంతలతోపాటు బురదతో అధ్వాన్నంగా మారింది.
దాంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బురద పేరుకుపోవడంతో వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు. పెద్ద ప్రమాదాలు జరుగకముందే అర్ అండ్ బీ అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.