ఎదులాపురం, మే 11 : బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణకు నిర్వహించే మమ్మోగ్రఫీ పరీక్షను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీలో రిమ్స్ దవాఖాన సూపరింటెండెంట్ అశోక్, ఆర్ఎంవో చంపత్రావుతో కలిసి మమ్మోగ్రఫీ స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ సకాలంలో వ్యాధు లను గుర్తించి చికిత్సను పొందితే ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు.
మహిళల ఆరోగ్య సమస్యలపై విస్తృతంగా అవగాహన కల్పించా ల్సిన అవసరం ఉందన్నారు. రిమ్స్‌లో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సులు, వైద్యులు, ఇతర సిబ్బంది పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రొమ్ము క్యాన్స ర్ లక్షణాలు ఉన్న మహిళలు మమ్మోగ్రఫీ చేయిం చుకోవాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో రిమ్స్ సూపర్ స్పెషాలిటీలోనే ఈ అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ పరీక్షలు ప్రైవేటులో చేయిం చుకుంటే రూ. 5 వేల వరకు ఖర్చవుతుందని తెలి పారు. ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా అంది స్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు.