నస్పూర్, ఆగస్టు 21 : నాగ్పూర్-విజయవాడ జాతీయ రమదారి 163( గ్రీన్ఫీల్డ్) కు సంబంధించి భూ సేకరణలో ప్రజలకు ఇ బ్బందులు లేకుండా ప్రక్రియ పూర్తి చేసేలా చ ర్యలు తీసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి వికాస్ రాజ్ అన్నారు. హైదరాబాద్ నుంచి బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలతో సమావేశం నిర్వహించారు.
జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా నాగ్పూర్-విజయవాడ వరకు నిర్మించే జాతీయ రహదారి 163లో (మంచిర్యాల-ఖమ్మం వరకు) భూ సేకరణ ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. భూములు కోల్పోయిన వారికి జాతీయ రహదారుల చట్టం ప్రకారం పరిహారం నిర్ధారించాలని సూచించారు. జిల్లాలో 110.6 హెక్టార్లకు గాను 83.05 హెక్టార్ల భూమి అప్పగించినటుల, 27.59 హెక్టార్ల భూమి రావాల్సి ఉందన్నారు.
12.81 హెక్టార్ల భూమికి సంబంధించి పరిహారం అందించగా, అధిక పరిహారం కోసం తిరిగి ఇచ్చినట్లు చెప్పారు. 5.33 హెక్టార్ల భూమి వివరాలు భూమిరాశి పోర్టల్లో నమోదు చేయాల్సి ఉందన్నారు. ప్రక్రియ పూర్తయిన వెంటనే పరిహారం అందిస్తామని వివరించారు. భూ సేకరణకు సంబంధించి ఆర్బిట్రేషన్ పరిహారం నిర్ణయించే అధికారం కలెక్టర్కు మాత్రమే ఉంటుందని ప్రధాన కార్యదర్శి తెలిపారు.