చింతలమానేపల్లి, జూన్ 26 : మండలంలోని కేతిని గ్రామ శివారులో అటవీ భూమిని రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా బుధవారం సర్వే నిర్వహించారు. ఆశ్రమ పాఠశాల వెనుక ఉన్న సర్వే నం. 17, 18, 19 లోని 7.24 ఎకరాల్లో 70 ఏళ్ల వయస్సున్న విలువైన టేకు చెట్లు ఉన్న భూమి తమదేనని అటవీశాఖ అధికారులు అంటుండగా, కాదు తమదేనని ప ట్టాదారులు అంటున్నారు.
ఇటీవల ఈ భూమిలో ఉ న్న టేకు చెట్లను నరికేందుకు అనుమతి ఇవ్వాలని అటవీ శాఖ అధికారులను పట్టాదారుడు కోరాడు. హద్దులు గుర్తించేందుకు రెవెన్యూ అధికారులకు అర్జీ పెట్టుకున్నాడు. ఆర్ఐ జాఫర్, సర్వేయర్ శ్రీకాంత్, కేతిని ఫారెస్ట్ సెక్షన్ అధికారి సూర్యనారాయణ, బీట్ అధికారి రాజేశ్ పట్టాదార్ తరఫున వ్యక్తితో కలిసి సర్వే చేశారు.