ఆదిలాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ) : ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నా రు. బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా కార్యాలయం లో జాతీయ జెండా, పార్టీ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని తెలిపారు. నవతెలంగాణ నిర్మాణం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటుందన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, బీఆర్ఎస్ నాయకులు అజయ్, విజ్జిగిరి నారాయణ, యూనిస్ అక్బానీ, గండ్రత్ రమేశ్, స్వరూప, మమత, పర్వీన్, ఫెరోజ్, దమ్మపాల్, కొండ గణేశ్ పాల్గొన్నారు.

ఉద్యమకారుల త్యాగాలు చిరస్మరణీయం
బోథ్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, రైతులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బోథ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీ య జెండాను ఆవిషరించారు. తెలంగాణ తల్లికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి, పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వానికి దకుతుందని పేరొన్నారు. కష్టపడి సాధించిన తెలంగాణను పదేండ్లు ఇష్టపడి అభివృద్ధి చేసుకున్నామన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ నిరంతరం ప్రజలు, రైతుల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షు లు శ్రీధర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, మాజీ ఏఎంసీ చైర్మన్ రుక్మణ్ సింగ్, జనరల్ సెక్రెటరీ ఎలుక రాజు, పట్టణ అధ్యక్షుడు అల్లకొండ ప్రశాంత్, యూత్ అధ్యక్షుడు మెడిచేల్మా ప్రవీణ్, లైబ్రరీ మాజీ డైరెక్టర్ రమణ గౌడ్, కౌట సర్పంచ్ స్వామి, బాపురెడ్డి, సాగర్ రెడ్డి, గంగమల్లు, సోమేశ్, వీడీసీ పోతన్న, రౌఫ్, రమణ రెడ్డి, రూప్‌చంద్, రాజారెడ్డి, ఇఫ్తేఖార్, రమణ, రాజారాం, లక్ష్మణ్, ప్రతాప్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిందే గులాబీ జెండా
సోన్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన జెండా గులాబీ జెండా అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మంగళవారం నిర్మల్ మండలంలోని కొండాపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాతోపాటు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆనాడు కేసీఆర్ తన పదవులను గడ్డిపోచల్లేక్క రాజీనామా చేసి ఉద్యమాన్ని ప్రారంభించారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కడిగా మొదలై లక్షలాది మందిని జోడించి ఉద్యమాన్ని మధ్యలో ఆపితే రాళ్లతో కొట్టి చంపండని అన్న దమ్మున్న మాట చెప్పిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, కౌన్సిలర్ శ్రీకాంత్‌యాదవ్, మాజీ కౌన్సిలర్ రాజేందర్, నిర్మల్ రూరల్, మామడ మండలాల కన్వీనర్లు మహేశ్‌రెడ్డి, చంద్రశేఖర్‌గౌడ్ పాల్గొన్నారు.