రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విడుదల చేయాలి
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ 2024 ఏప్రిల్ నుంచి వారి బెనిఫిట్స్ వెంటనే ఏక మొత్తంగా విడుదల చేయాలని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఆర్ఈఏ) సంఘం అధ్యక్షుడు లింగయ్య డిమాండ్ చేశారు.
తాండూర్ : రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ 2024 ఏప్రిల్ నుంచి వారి బెనిఫిట్స్( Benefits ) వెంటనే ఏక మొత్తంగా విడుదల చేయాలని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఆర్ఈఏ) సంఘం అధ్యక్షుడు లింగయ్య డిమాండ్ చేశారు. తాండూరు మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సంఘం కార్యదర్శి కే నర్సయ్య, ఆర్థిక కార్యదర్శి జగన్మోహన్ చారి, ముఖ్య సలహాదారులు ఆక్కపెళ్లి బాపు, వైకుంఠం, బాద్యులతో కలిసి చేపట్టారు.
ఈసందర్భంగా ప్రభుత్వ విశ్రాంత ఉపాధ్యాయులైన మాసాడి శ్రీరాములు, గట్టు శ్రీహరి, ముద్దు రాంబాబు, ఇందూరి ఆశన్నకు సభ్యత్వము అందించారు. నమోదు అనంతరం అధ్యక్షుడు సాధు లింగయ్య మాట్లాడుతూ పీఆర్సీనీ వెంటనే అమలు చేయాలని, బకాయి ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హెల్త్ కార్డులను వెంటనే ఇవ్వాలని, 398 వేతనంపై నియుక్తులైన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అలసత్వం వహిస్తే దశలవారీగా ఉద్యమిస్తామన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

