కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో సర్పంచ్ ( Sarpanch) స్థానాలు బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని కాసిపేట మండల బీసీ రిజర్వేషన్ ( BC Reservations ) సాధన సమితి ఆధ్వర్యంలో ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, మాజీ సర్పంచ్ దుస్స చందు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌కు వినతి పత్రం అందించారు.
మండలంలో ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీకి కేటాయించలేదన్నారు. 2019లో బీసీలకు రెండు గ్రామ పంచాయతీలు కేటాయించగా ఇప్పుడు కనీసం ఒక్క సీటు కేటాయించలేదన్నారు. కాసిపేట మండలంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం సరైంది కాదన్నారు.
బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. మండలానికి బీసీలకు న్యాయ పరంగా రిజర్వేషన్ కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.