తాండూర్ : మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న కల్వర్టులు ( Culverts ) , రోడ్లు ( Roads ) బాగు చేయాలని బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి జీఎంకు తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ఆదివాసీలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలతో పాటు సర్సాపూర్ గ్రామంలో వర్షాలకు కల్వర్టు పైపులు కొట్టుకుపోయాయని, రోడ్లు దెబ్బతిన్నాయని వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.
తమ సమస్యలపై జీఎం సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ తాండూర్ మండల అధ్యక్షుడు కుర్సెంగ బాబురావు, గ్రామస్థులు సోయం పర్బత్ రావు, దినర్సవ్, శ్యామ్ రావు, బాదిరావు, జంగు, బొజ్జిరావ్, అనిల్, పాల్గొన్నారు.