ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఆగస్టు 14 : ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోవ లక్ష్మి ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం పొందుపరిచారని, ఆమె ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజ్మీరా శ్యాం నాయక్ నవంబర్ 21, 2024లో సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టులో జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం విచారణ జరిపి కొట్టేసింది. జనవరి 6, 2024లో శ్యాం నాయక్ హైకోర్టును ఆశ్రయించగా, 2024 అక్టోబర్ 25న హైకోర్టు కోవ లక్ష్మికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దానిని సవాలు చేస్తూ శ్యాం నాయక్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
తన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజ్మీరా శ్యాం నాయక్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసిందని, చివరికి న్యాయమే గెలిచిందని, ఇది ప్రజల విజయమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో అన్యాయానికి స్థానం లేదని, న్యాయమే గెలుస్తుందని సుప్రీం కోర్టు నిరూపించిందన్నారు. పిటిషన్ కొట్టివేయడంతో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఇంటికి భారీగా తరలి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఎమ్మెల్యేకి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
జైనూర్/తిర్యాణి/రెబ్బెన, ఆగస్టు 14 : ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజ్మీరా శ్యాం నాయక్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో గురువారం బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటి ఎదుట సంబురాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చి.. మిఠాయిలు తినిపించుకున్నారు. జైనూర్, తిర్యాణి, రెబ్బెనలో నాయకులు పటాకులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.
ఆయాచోట్ల సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జాబోరే రవీందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనక యాదవరావు, సహకార చైర్మన్ కొడప హన్నూపటేల్, పీఏసీఎస్ ఛైర్మన్ కార్నాథం సంజీవ్‌కుమార్, వైస్ చైర్మన్ రంగు మహేశ్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొటు శ్రీధర్‌రెడ్డి, మాజీ ఏఎంసీ వైస్ ఛైర్మన్ కుందారపు శంకరమ్మ, మాజీ వైస్ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, సోషల్ మీడీయా కన్వీనర్ వినోద్‌జైస్వాల్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, మాజీ వైస్ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, సోషల్ మీడీయా కన్వీనర్ వినోద్ జైస్వాల్, మాజీ ఎంపీటీసీ సంగం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు భగవంత్‌రావు, నాయకులు సందీప్, రాజు, నిస్సార్, వినోద్, గోపాల్, లక్ష్మణ్, శంకర్, మాజీ ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి పల్లె రాజేశ్వర్‌రావు, బోమ్మినేని శ్రీధర్, దుర్గం భరద్వాజ్ పాల్గొన్నారు.