రోగి మృతిపై బంధువుల ఆగ్రహం
రోగి మృతికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు శుక్రవారం ఖానాపూర్ ప్రభుత్వ దవాఖాన ఎదుట నిరసన తెలిపారు. మృతుడి కుమారుడు షేక్ షారుఖ్ మాట్లాడుతూ సుర్జాపూర్ గ్రామానికి చెందిన తన తండ్రి షేక్ హుస్సేన్(55)కు ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో తీవ్ర శరీర నొప్పులు, ఛాతి నొప్పి, అధిక చెమటలు రావడంతో స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి సూచన మేరకు వెంటనే ప్రభుత్వ దవాఖానకు తీసుకువచ్చినట్లు తెలిపారు.
- ఖానాపూర్ ప్రభుత్వ దవాఖాన ఎదుట కుటుంబ సభ్యులు, బంధువుల నిరసన
ఖానాపూర్, జూన్ 12: రోగి మృతికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు శుక్రవారం ఖానాపూర్ ప్రభుత్వ దవాఖాన ఎదుట నిరసన తెలిపారు. మృతుడి కుమారుడు షేక్ షారుఖ్ మాట్లాడుతూ సుర్జాపూర్ గ్రామానికి చెందిన తన తండ్రి షేక్ హుస్సేన్(55)కు ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో తీవ్ర శరీర నొప్పులు, ఛాతి నొప్పి, అధిక చెమటలు రావడంతో స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి సూచన మేరకు వెంటనే ప్రభుత్వ దవాఖానకు తీసుకువచ్చినట్లు తెలిపారు.
పరిస్థితిని వివరించినప్పటికీ, కేవలం ఇంజెక్షన్, మూడు మాత్రలు మాత్రమే దవాఖానలోని వైద్య సిబ్బంది ఇచ్చారని, బీపీ, షుగర్ పరీక్షలు చేయలేదని, డ్యూటీ డాక్టర్ కూడా పరిశీలించలేదని ఆరోపించారు. దాదాపు 40 నిమిషాల పాటు దవాఖానలో ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇంటికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అదేరోజు తెల్లవారుజామున తన తండ్రి పరిస్థితి విషమించడంతో మళ్లీ దవాఖానకు తీసుకురాగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు.
హుస్సేన్ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, పలువురు గ్రామస్తులు దవాఖాన ఎదుట నిరసన తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై దవాఖాన ఇన్చార్జి సూపరింటెండెంట్ స్వర్ణరెడ్డిని వివరణ కోరగా డ్యూటీలో ఉన్న వైద్యులు, సిబ్బందికి కేవలం ఒళ్లు నొప్పులున్నాయని తెలుపడంతో చికిత్స అందించారన్నారు. సిబ్బంది అనుమతి తీసుకోకుండా బంధువులు రోగిని ఇంటికి తీసుకెళ్లారని ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిస్తానని తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

