నార్నూర్, ఆగస్టు 25 : అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జాడే దయానంద్ తల్లి శాంతాబాయి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ బాధిత కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. శాంతాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
శాంతాబాయి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అంతకుముందు భీంపూర్లో నిర్వహించిన తెర్వీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, జిల్లా నాయకుడు ఉద్ధవ్ కాంబ్లే, డైరెక్టర్ దుర్గారావు, మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాసిం, మాజీ ఎంపీటీసీ రాథోడ్ రమేష్, పట్టణ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్, సుల్తాన్ ఖాన్, పట్టణ ఉపాధ్యక్షుడు రాథోడ్ శివాజీ తదితరులున్నారు.